Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు అందరూ కషి చేయాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తార్నాక డివిజన్ లాలాపేట్‌లో మత్తు పదార్థాల (డ్రగ్స్) నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగంతో వచ్చే అనర్థాలు యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యత నెరవేర్చాలని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సై రవి కుమార్, బిక్షం, టీఆర్ఎస్ నాయకులు, కార్యక్తరలు తదితరులు పాల్గొన్నారు.