Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌత్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మూట విజయ్ కుమార్
- 13న కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని టీఎంకేఎంకేఎస్ (తెలంగాణ మత్యకారులు, మత్యకార్మిక సంఘం) సౌత్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మూట విజరు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాతబస్తీ గౌలిపుర గంగపుత్ర సంఘం కార్యాలయంలో టీఎంకేఎంకేఎస్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూన్ 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నా పోస్టర్‌ను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీడీ ద్వారా 2వ విడతగా మత్స్యకారులకు వివిధ సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు. మధ్యదళారీ విధానం పోవాలనే ఉద్దేశంతో మత్స్యకార సంఘాలు అనేక ఏండ్లుగా పోరాడిన ఫలితంగా ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అమలు చేసిందన్నారు. నాసిరకం చేపపిల్లలు, సంఖ్యలో, సైజులో తక్కువగా ఇస్తూ దళారులు కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. గతేడాది రూ.86 కోట్లతో చేపపిల్లలు, రూ.20 కోట్లతో రొయ్యపిల్లల టెండర్ల ద్వారా పంపిణీ చేశారన్నారు. ఫలితంగా దళారులకు పెద్దఎత్తున లాభపడ్డారని ఆరోపించారు. చేపపిల్లల కొనుగోలు కోసం మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని, మత్స్యకార సంఘాలు, కుల సంఘాలు, జిల్లా ఫెడరేషన్లు మంత్రికి ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఏడాదైనా టెండర్లు రద్దుచేసి నేరుగా మత్స్యసొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయి అనేక ఇబ్బందుల్లో ఉన్న 200 మత్స్యకార కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఇన్స్యూరెన్సు, ఎక్స్ గ్రేషియోలు వెంటనే అందజేయాలని డిమాంండ్ చేశారు. 2వ విడతగా ఎన్సీడీసీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని ఈనెల 13న జిల్లా కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన ధర్నాలో మత్స్య కారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, గౌలిపుర మత్స్య సొసైటీ అధ్యక్షులు మూట దశరథ్, సొసైటీ ప్రధాన కార్యదర్శి గువ్వల కష్ణ, డైరెక్టర్లు గరిగ దాస్, కాడబోయిన నరసింగ్ రావు, కల్చేటి యాదగిరి, తాండ్ర శ్రీహరి పాల్గొన్నారు.