Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ
నవతెలంగాణ-కల్చరల్
నేటి పరిస్థితుల్లో సాహితీ పత్రికను నడపడం సాహసమేనని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై సాహితీ కిరణం మాసపత్రిక 13వ వార్షికోత్సవం సభ జరిగింది. డాక్టర్ రమణ మాట్లాడుతూ 13 ఏండ్లుగా సాహిత్య పత్రికను నిరాటంకంగా నడుపుతున్న సుబ్బారావుకు ఉన్న సాహితీ పిపాస ఆ పత్రికకు ప్రాణవాయువుగా పనిచేస్తోందని అన్నారు. సంస్థ అధ్యక్షులు వెంకట రెడ్డి అధ్యక్షత వహించిన సభలో పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు స్వాగతం పలుకుతూ పత్రిక నిర్వహణ సాధక బాధకాలు వివరించారు. నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవ దాసు, కవి పెద్దూరి వెంకట దాసు పాల్గొన్న సభలో పింగళి జగన్నాథరావు సాహితీ పురస్కారం నవల రచయిత ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్‌కు, ఎస్. బాలమ్మ స్మారక పురస్కారం రచయిత్రి శోభ పెరిందేవికి, జనాభట్ల నరసింహ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం కవి కె. లక్ష్మీ కాంతం కు బహుకరించారు. సాహితీకిరణం పుష్కర పురస్కారాలతో పాటు బాల గంగాధరయ్య నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.