Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేట్ డ్రైవర్స్ అసోసియేషన్
నవతెలంగాణ-కూకట్పల్లి
సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాని జీహెచ్ఎంసీ మినీ టిప్పర్ డ్రైవర్లు కూకట్పల్లి ట్రక్ పార్కింగ్ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. ప్రయివేట్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎడవల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో డ్రవర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, మూడు రోజుల నుండి మినీ టిప్పర్ డ్రైవర్లను, వర్కర్లను రాంకీ సంస్థ పరిధిలోకి మార్చారన్నారు. అప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.