Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. పట్టణపగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తార్నాక డివిజన్లోని మాణికేశ్వరనగర్లో అధికారులతో స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించి, తక్షణం మరమ్మతు పనులు పూర్తిచేయాలని, అభివద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, కాలనీవాసుల సహకారంతో డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ గౌడ్, శానిటేషన్ సూపర్వైజర్ ధన గౌడ, డిప్యూటీ జనరల్ మేనేజర్ నికితా రెడ్డి, ఏఈ వెంకటేష్, హార్టికల్చర్ సూపరవైజర్ సిందుజా, ఏఈ భరత్ నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుల వెంకటేష్, నగేష్ గౌడ్, గండికోట రమేష్, నటరాజ, గణేష్, అయ్యప్ప రెడ్డి, బలరామ్, ఖాజా పాషా, అహ్మద్ పాల్గొన్నారు.