Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో శుక్రవారం నిజాం కళాశాల నుంచి బషీర్ బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నిజాం కళాశాల అధ్యక్షులు సోనాబోయిన రాకేష్ మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా రవాణా చార్జీలను పెంచడమే కాకుండా విద్యార్థుల బస్ ధరలను పెంచడం దారుణమన్నారు. రెండు దశాబ్దాలుగా బస్‌పాస్ ధరలను ఇంత పెద్దమొత్తంలో ఎన్నడూ పెంచలేదన్నారు. పెంచిన ధరల్లో గతంలో నెలవారి పాస్ రూ.165 ఉంటే దాన్ని రూ. 400ు మూడు నెలల బస్ పాస్ రూ.495 ఉంటే నేడు రూ.1,200 కు పెంచారని విచారం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులపై మోయలేని భారం అన్నారు. ఇప్పటికే వేల రూపాయలు ప్రయివేటు ఫీజులు కట్టలేక చదువుకు దూరమైన విద్యార్థులు అనేక మంది ఉన్నారని, ప్రయివేటు చదువు భారమైన ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు బస్ చార్జీలు గుదిబండగా మారే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే ఈ విషయంలో స్పందించి, పెంచిన బస్ చార్జీలను తగ్గించాలన్నారు. లేకపోతే పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై తరగతి గదుల్లో ఉండే విద్యార్థులు రోడ్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నిజాం కళాశాల వైస్ ప్రెసిడెంట్స్ తిరుపతి, ఉదరు, ఇన్చార్జి వంశీ, కోశాధికారి పవిత్ర, నాయకులు సాయి, విక్రమ్, నాగరాజు, భీంసేన్, నవీన్, సాయిప్రకాష్, రవితేజ, రాజు, భాను, అజరు, శ్రావణి, రఘు, చరణ్, ప్రశాంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.