Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నాలా పూడికతీత మట్టిని వెంటనే తొలగించాలని సీపీఐ(ఎం) చాంద్రాయణగుట్ట డివిజన్ కార్యదర్శి ఎస్. కిషన్, స్వామి, జీవన్ డిమాండ్ చేశారు. ఆదివారం గౌస్‌నగర్‌లో పర్యటించి ఓపెన్ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌస్‌నగర్ ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రక్కన ఓపెన్ నాలాలో జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల మట్టి పూడికతీశారని చెప్పారు. నాలా పక్కన వేసిన మట్టిని సకాలంలో తొలగించకపోవడంతో తిరిగి అది నాలాలోకి చేరుతుందన్నారు. పూడిక తీసిన మట్టిని వెంటనే తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ చిన్నపాటి వర్షం కురిసినా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. దీని దష్టిలో పెట్టుకొని పూడిక మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎండీ గౌస్, అష్మ, పర్వీన్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.