Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఎస్పీ బాలును గాయకునిగా కీర్తిస్తారని, కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞా వంతుడని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ఆర్.కె కళా సాంస్కతిక ఫౌండేషన్ నిర్వహణలో తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి పురస్కరించుకుని సంగీత నత్య కార్యక్రమం ఆదివారం నిరాటంకంగా పది గంటలపాటు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సుమన్ పాల్గొని మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం గళ దాతగా అన్నమయ్య చిత్రంలో తన వెంకటేశ్వర పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ పాత్రను చిరస్మరణీయం చేశారని గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాతగా, కార్యక్రమ వ్యాఖ్యాతగా పడుతా తీయగా నిర్వాహకునిగా, నటునిగా భిన్న కోణాలు ఆయనలో ఉన్నాయని కొనియాడారు. పర్యాటక అభివద్ధి శాఖ చైర్మెన్ శ్రీనివాస్ గుప్త, నటి దివ్యవాణి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్, సామాజిక కార్యకర్త చిల్ల రాజశేఖర రెడ్డి, లక్ష్మీ రాజ్యం, సుధా జైన్, డాక్టర్ ఎస్. రామచంద్ర రావు తదితరులు పాల్గొన్న సభకు సంస్థ నిర్వాహకుడు రంజిత్ కుమార్ స్వాగతం పలికి నత్య సంగీత గురువులు శిష్యులను సత్కరించారు.