Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలోని అన్ని ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషిచేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో నూతనంగా నిర్మించిన వసతి కాంప్లెక్సును, స్థానిక కార్పొరేటర్ కవిత రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్లోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక వసతి గదులను నిర్మించి బోనాల పండుగ, వైకుంఠ ఏకాదశి, శివరాత్రి, సీతారాముల, వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆలయాల్లో సేవలందించే పండితులకు వేతనాలు, బోనాల పండుగకు ప్రత్యేక చెక్కులు పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కోల్లి రమేష్ చౌదరి, చైర్మెన్ సుజాత, ఈఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.