Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజలు ఆరోగ్యంపై అలసత్వం చేయొద్దని, ప్రతి ఆరు నెలలకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని బంజారాహిల్స్ సెంచరీ ఆస్పత్రి వైద్య బందం సూచించింది. ఆదివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్లో 200 మందికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, షుగర్, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ విశ్లేషణలాంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి సలహాలు, సూచనలు మందులు అందజేశారు. ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ మనిషి చేయగల మంచి పనుల్లో ఆరోగ్యం కోసం నడవడం ఒకటన్నారు. నడవడం, ఆరోగ్యకరమైన వ్యాయామాలు చేయడం, యోగ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికే ఈ శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడేవారికి తమ సాయం, మద్దతు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.