Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అన్నపూర్ణనగర్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులను కోరారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం అంబర్‌పేట డివిజన్ అన్నపూర్ణ నగర్ కాలనీ (నరేంద్రనగర్)లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ విజరు కుమార్‌తో కలిసి పర్యటించారు. కాలనీ డ్రయినేజీ, సీసీరోడ్లు, సీసీ కెమెరాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానీలోని డ్రయినేజీ, సీసీ రోడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లోప్రెషర్ నీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణనగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అన్నపూర్ణ నగర్ కాలనీ అధ్యక్షుడు నరసింహ, ప్రధాన కార్యదర్శి మధు కుమార్, కోశాధికారి వెంకటయ్య, ఉపాధ్యక్షులు బాలరాజ్, సత్యవతి, లీగల్ అడ్వయిజర్ శ్రీకాంత్‌చారి, జీహెచ్ఎంసీ అధికారులు డీసీ వేణుగోపాల్, నోడల్ అధికారి హరి శంకర్, ఈఈ శంకర్, జల మండలి ఏఈ కుషాల్, ఏఈ విగేశ్వరి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.