Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరాభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందించే అవకాశం లభించిందని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 10, 11వ డివిజన్లలో కమిషనర్ డా. పి.రామకష్ణ రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు స్థానికంగా నెలకొన్న తాగునీరు, విద్యుత్, పారిశుధ్య తదితర సమస్యలను అధికారులకు తెలియజేశారు. ప్రధానంగా 10వ డివిజన్లో గతంలో వరదల కారణంగా బోడుప్పల్ అల్మాస్ కుంట నుంచి వరదనీటితో మల్లికార్జుననగర్ కాలనీ ముంపునకు గురికావడం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితి మరలా పునరావతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎన్డీపీ ద్వారా రూ.110కోట్లు నిధులు మంజూరు చేసుకొని ఇప్పటికే పర్వతాపూర్ చెరువు, పీర్జాదిగూడ చెరువు వద్ద పనులు జరుగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా భవిష్యత్ అవసరాలకు నిమిత్తం 24 గంటలు తాగునీటి సరఫరా కోసం నూతన రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్యం, హరితహారం, సోర్స్ సెగ్రీగెషన్ ద్వారా తడి, పొడి, హానికారక చెత్తను వేరుచేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డ్ కమిటీ సమావేశంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్‌ను ప్రణాళికబద్దంగా, ప్రాధాన్యత క్రమంలో అభివద్ధి చేస్తున్నామన్నారు. పాలక మండలి ఏర్పడగానే బుద్ధనగర్ పార్కును పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో అభివద్ధి చేసామన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 'స్ట్రీట్ వెండింగ్ జోన్స్' ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నామని, సుమారు రూ.7.5కోట్లతో ఆధునిక సమీకత మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. 40 ఫీట్ రోడ్డును ఫుట్‌పాత్, అవెన్యు ప్లాంటేషన్ చేసి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజల శాంతి భద్రతలకోసం ప్రతి కాలనీకి అనుసంధానంగా రూ.1.5కోట్లతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 'స్వచ్ఛ పీర్జాదిగూడ' నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో చెత్తను తడి, పొడి హానికారక 3 రకాలుగా వేరు చేసి అందించాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పిట్టల మల్లేష్, నాయకులు వీరమల్లు సత్యనారాయణ, డీఈ శ్రీనివాస్, ఏఈ వినీల్, విద్యుత్ అధికారులు, హెచ్ఎండబ్యుఎస్ అధికారులు, వార్డ్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.