Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
- క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
నవతెలంగాణ-అడిక్‌మెట్
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సమస్యల పరిష్కారానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కేర్స్ పేరుతో క్యూఆర్ కోడ్ సహాయంతో ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్లోని హెచ్తర్ వసుధ అపార్ట్మెంట్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేర్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌వాసులు వారి ఫిర్యాదులు సులభంగా తమ దష్టికి తీసుకురావడానికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని అపార్ట్మెంట్లల్లో క్యూఆర్ కోడు సంబంధించిన స్టికర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహా, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు, శ్రీకాంత్, పున్న సత్యనారాయణ, ఎస్టీ ప్రేమ్ స్థానిక అపార్ట్మెంట్ వాసులు విశ్రాంత బ్యాంక్ అధికారి శ్రీనాథ్ రావు తదితరులు పాల్గొన్నారు.