Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా మల్కాజిగిరి నియోజకవ ర్గంలోని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నా రు. గౌతంనగర్ డివిజన్ పరిధి లోని మల్లికార్జున నగర్లో ఆదివారం రూ.31 లక్షలతో సీ సీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో ప్రారంభించి మాట్లా డారు. 2 నెలల క్రితం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఐఎన్ నగర్లో జరిగి న ప్రజాదర్బార్‌లో మంత్రి కేటీఆర్‌తో గౌతమ్ నగర్ డివిజన్‌కు రూ.2 కోట్లు చేశామనీ, అందులో భాగంగానే ఆదివారం మల్లికార్జున నగర్లో రోడ్డు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అనంతరం మల్కాజ్ నగర్ మల్లన్న టెంపుల్ వద్ద విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్ తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్య జ్యోతి, వాటర్ వర్క్స్ డీజీఎం స్రవంతి, మేనేజర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు రాముయాదవ్, సతీష్ కుమార్, పి.శ్రీనివాస్, భైరు అనిల్ కుమార్, ప్రసా ద్ యాదవ్, మల్లేష్ యాదవ్, కిట్టు, లక్ష్మణ్, మల్లికార్జుననగర్ అసోసియేషన్ సభ్యులు వెంకటయ్య, అచ్యుతరావు, పండారి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.