Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కసరత్తు చేస్తున్న బల్దియా
- ఈనెల 20 నుంచి గుర్తింపు క్యాంపులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలో వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు పరికరాలు, ఉపకరణాలు, కృత్తిమ అవయాలు అందించేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. వారిని గుర్తించడానికి స్పెషల్ క్యాంపు లను నిర్వహించాలని నిర్ణయించారు. అలీమ్ కో స్వచ్ఛంద సంస్థ ద్వారా వికలాంగులు, సీనియర్ సిటిజన్లను గుర్తింపు అసెస్మెం ట్ను సర్కిళ్ల వారీగా ఈనెల 20వ తేదీ నుంచి జూలై 6 వరకు క్యాంపులను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గుర్తించిన సెంటర్లో అన్ని వసతులు ఏర్పాటు చేయా లనీ, సెంటర్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఈనెల 14వ తేదీ వరకు నివేదిక పంపించాలని డిప్యూటీ కమిషనర్లను కమిష నర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. క్యాంపు సందర్భంగా డీసీలు సందర్శించి సుమారు 300 మందికి సరిపోను కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యతతో పాటుగా వికలాంగులు, సీనియర్ సిటిజన్లు క్యాంపులకు వచ్చే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
రెండు బృందాలు
ప్రత్యేక క్యాంపుల సందర్భంగా రెండు డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీమ్‌లో ఒక ప్రొస్తేటిస్ట్ వైద్యునితో పాటు మరొక ఆర్తోటిస్ట్స్ వైద్యునితోపాటు ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు సహాయకులు ఉంటారు. ప్రత్యేక శిబిరాల్లో గుర్తించిన వారికి పంపిణీ సందర్భంగా ప్రోటో కాల్ తప్పని సరిగా పాటించాలని నిర్ణయించారు. సదరన్ క్యాంపు సర్టిఫికేట్ తప్పని సరిగా ఉండాలనీ, లేని పక్షంలో తిరిగి సదరన్‌కు అప్లై చేసిన రశీదు అందజేయాల్సి ఉంటుంది. అర్హులైనవారు ఏఒక్కరూ మిస్ కాకుండా గుర్తింపు అసెస్మెంట్ చేయనున్నారు. ఈ క్యాంపు ద్వారా పరికరాలు, సహాయ ఉపకరణాలు, కృత్రిమ పరికరాలు ఎన్ని అవ సరం ఉంటాయో నిర్ధారించనున్నారు. ఆ తర్వాత క్యాంపులు నిర్వహించిన చోటనే తిరిగి పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కావాల్సిన డాక్యుమెంట్లు
సదరన్ క్యాంపుల సందర్భంగా వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్/ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అంగవైకల్యానికి సంబంధించిన రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ఉండాలి. సీనియర్ సిటిజన్లకు పుట్టిన తేదీతో ఉన్న ఆధార్‌కార్డు, సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు తప్పని సరిగా ఉండాలి. ఈ క్యాంపులు నాన్ లోకల్ వారికి వర్తించదు.
20 నుంచి క్యాంపులు
సదరను క్యాంపులను జూన్ 20 తేదీ నుంచి జూలై 6 వరకు చేపట్టే ప్రత్యేక క్యాంపులు రోజుకు రెండు సర్కిల్లో నిర్వహించ నున్నారు. జూన్ 20న కాప్రా సర్కిల్లో ఏఎస్రావు నగర్‌లోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్, ఉప్పల్ సర్కిల్లో రామంతపూర్‌లో గల గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించ నున్నారు. జూన్ 21న హయత్‌నగర్ సర్కిల్ నాగోల్‌లోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్, ఎల్బీనగర్ సర్కిల్లో లింగోజగూడ జ్యోతి క్లబ్ కమ్యూనిటీ హాల్, జూన్ 22న సరూర్‌నగర్ సర్కిల్లో లింగోజిగూడ జ్యోతి క్లబ్ కమ్యూనిటీ హాల్, మలక్‌పేట్ సర్కిల్ మూసారాంబాగ్ అర్టీఓ ఆఫీస్ దగ్గర గల శ్రీపురం కమ్యూనిటీ హాల్, జూన్ 23న సంతోష్‌నగర్ సర్కిల్లో కాలెంద్రనగర్ కమ్యూనిటీ హాల్, చాంద్రాయణగుట్ట సర్కిల్లో రక్షపురం మోడల్ మార్కెట్ వద్ద నిర్వహించనున్నారు. జూన్ 24న చార్మినార్ సర్కిల్లో మొఘుల్పుర స్పోర్ట్ కాంప్లెక్స్, ఫలక్నామా సర్కిల్లో చందూలాల్ బరాదారి స్పోర్ట్ కాంప్లెక్స్, జూన్ 25న రాజేంద్రనగర్ సర్కిల్లో శివరాంపల్లి సాయిబాబా టెంపుల్ ఎస్బీఐ ఎదురుగా ప్రజాభవన్, మెహదిపట్నం సర్కిల్లో బజార్‌ఘాట్ లక్ష్మినగర్ కమ్యూనిటీ హాల్, జూన్ 27న కార్వాన్ గణపతి సంఘం కమ్యూనిటీ హాల్, గోషామహల్ సర్కిల్లో జంబాగ్ డివిజన్ హిందీ నగర్ స్పోర్ట్ కాంప్లెక్స్, జూన్ 28న అంబర్పేట్ సర్కిల్ మునిసిపల్ స్పోర్ట్ కాంప్లెక్స్, ముషీరాబాద్ సర్కిల్ల అడిక్‌మెట్‌లోని లలితానగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్, జూన్ 29న ఖైరతాబాద్ సర్కిల్లో అమీర్‌పేట్ స్పోర్ట్ కాంప్లెక్స్, జూబ్లీహిల్స్ సర్కిల్లో బంజారాహిల్స్ రోడ్డు నెం.2 సీఎంటీఎస్ బిల్డింగ్, జూన్ 30న యూసుఫ్‌గూడా సర్కిల్లో ప్రభుత్వ పాఠశాల, శేరిలింగంపల్లి సర్కిల్లో జోనల్ ఆఫీస్ మీటింగ్ హాల్, జూలై 1న చందానగర్ సర్కిల్లో సర్కిల్ ఆఫీస్ పక్కన గల బీఅర్ అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపం, అర్సీపురం సర్కిల్లో పఠాన్‌చెరు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జూలై 2న మూసాపేట్ సర్కిల్లో కేపీహెచ్‌బీ ఫోర్త్ ఫేస్ కమ్యూనిటీ హాల్, కుత్బుల్లాపూర్ సర్కిల్ జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, జూలై4న కూకట్పల్లి సర్కిల్లో కేపీహెచ్‌బీ ఫోర్త్‌ఫేస్ కమ్యూనిటీ హల్, గాజుల రామారం సర్కిల్లో చింతల్ భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్, జూలై 5న అల్వాల్ సర్కిల్లో ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్, మల్కాజిగిరి సర్కిల్లో నేరెడ్మెట్ అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, జూలై 6న సికింద్రాబాద్ సర్కిల్లో బౌద్ధనగర్ కమ్యూనిటీ హల్, బేగంపేట్ సర్కిల్లో బన్సిలాల్‌పేట్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించనున్నారు.