Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్ పల్లి
అవని స్వచ్ఛంద సంస్థ వ్యస్థాపకురాలు శిరీష సత్తూర్ తమ కుమార్తె శాన్వి పుట్టినరోజు సందర్భంగా ఎల్లమ్మబండ నగర్లో నివసించే మేఘన అనే పేదింటి ఆడపిల్ల విద్య కోసం రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ ఆడపిల్ల చదువు, అభివృద్ధి, విద్య కోసం తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. పీజేఆర్ నగర్ వాస్తవ్యులు ఆమె పేదలకు అందిస్తున్న సేవలకుగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్తూర్ నవీన్ కుమార్, సంగమేష్, శ్యామ్, సుందర్, దొరబాబు, తిరుపతి, శ్రీనివాస్, రమేష్, తులసీరామ్ పాల్గొన్నారు.