Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నాహక సమావేశంలో ఆవాజ్
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
- జూలై 3న ఆవాజ్ నగర రెండో మహాసభ
నవతెలంగాణ-ధూల్‌పేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే దేశంలో భద్రత, లౌకిక విలువలు దిగజారుతున్నాయని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. ఆదివారం మొగల్పుర ఉర్దూఘర్‌లో ఆవాజ్ హైదరాబాద్ నగర రెండో మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై ప్రభుత్వాల వైఫల్యమే కారణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నపూర్ శర్మని, నవీన్ జిందాల్‌ని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దేశ శాంతి భద్రతలను, లౌకిక విలువలను కాపాడాలని, హిందూ ముస్లిం ఐక్యత పెంపొందించాలని డిమాండ్ చేశారు. అవామీ మజ్లిస్ ఏ అమల్ నాయకులు ముజాహిద్ హష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలిండియా మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మహమ్మద్ షంషుద్దీన్ ఖాద్రి మాట్లాడుతూ గత ఎనిమిదేండ్ల కాలంలో దేశంలో అశాంతి, అభద్రత భావం పెరిగిపోయిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలు దిగిపోవాలన్నారు. కార్మిక నాయకులు మీనా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివరించడం సరికాదన్నారు. ప్రజా పరిపాలన గాడి తప్పించి, మత వర్గ విభేదాలను సష్టించడంపై మండిపడ్డారు.
భవిష్యత్ కార్యచరణకు సన్నాహాలు
నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర కమిటీ మైనారిటీల సమస్యలపై విస్తతంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి మూడేండ్లకోసారి ఆవాజ్ మహా సభలు నిర్వహించి సమీక్షలు, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఆవాజ్ కమిటీ రెండో నగర మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహాసభల నిర్వహణకు ఆహ్వాన సంఘం కమిటీ 120 మందితో ఏర్పాటు చేశామని, అందరూ భాగస్వాములై మహాసభలు మరింత ఉత్సాహంతో విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు.
నూతన ఆహ్వాన సంఘం
నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో 120 మందితో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చైర్మెన్‌గా డాక్టర్ మహ్మద్ ఎఖ్బల్ జావిద్, వైస్ చైర్మెన్‌గా డాక్టర్ మహ్మద్ ముష్తోఖ్, మహమ్మద్ నయిములా షరీఫ్, డాక్టర్ పర్వీన్ సుల్తానా, సీనియర్ అడ్వకేట్ అబ్దుల్ ఖుద్దూస్ గౌరీ, మహ్మద్ షకీల్, అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, మహమ్మద్ హబీబ్ ఉద్దీన్, అనేక జిల్లా ప్రజా సంఘాల నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ ఆవాజ్ సంఘం చేసిన కార్యక్రమాలు, చేయబోయే కర్తవ్యాల గురించి వివరించారు. అలాగే అనేక సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనను జీ.విఠల్ వివరించారు. జూలై 3న జరగబోయే ఆవాజ్ నగర రెండో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.