Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు, నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.