Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయ కేతనం ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీజ కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల బీమా పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన గ్రేటర్ నాయకులు రాజారాం రాజలింగం, జన సేన వీర మహిళా వైస్ ప్రెసిడెంట్ నిహారిక హాజరై మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వం నమోదు కార్య్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. గ్రేటర్ పరిధిలో 15-20 నియోజక వర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా కార్యకర్తలను, వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. కార్యకర్తలు కూడా తన కుటుంబ సభ్యులేనని అన్న ఒకే ఒక్క పార్టీ జన సేన అన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్, నాగరాజు, సూర్య, వంశీ, దేవేందర్, నరేష్ నాయుడు, రామకృష్ణ, మదు, జెమిని, కె.నరేష్, గ్రేటర్ కమిటీ సభ్యులు, ఉప్పల్ నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.