Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఆధునిక జీవనశైలిలో మార్పుల వల్ల ఉత్పన్నమౌతోన్న వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో మై ఆర్తో క్లినిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో మై ఆర్తో క్లినిక్ ఆస్పత్రి డాక్టర్ విక్రమ్ కుమార్ బైరి ఆధ్వర్యంలో ఆస్పత్రి వైద్యులు పేదలకు మోకాళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులపై ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు బేతాళ బాలరాజు, పెంటయ్య గౌడ్, జనార్ధన్ గౌడ్, సహదేవ్, మాధవరావు, మధుసూధన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.