Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బషీర్‌బాగ్‌లోని శ్రీ అవంతి సిల్క్స్లో మిసెస్ ఇండియా తెలంగాణ మోడల్స్ ఆదివారం సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ మిసెస్ ఇండియా తెలంగాణ మమతా త్రివేది చేనేత వస్త్రాలను ఆవిష్కరించారు. చేనేత సారీస్‌లో ఎంతో పేరు గాంచిన శ్రీ అవంతి సిల్క్స్ భారతీ య సంప్రదాయంలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ చేనేత సారీస్‌ను అందిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ అవంతి సిల్క్స్ నిర్వహకులు నివేదితా మిశ్రా మాట్లాడుతూ ఏడు వసంతా లుగా కస్టమర్స్ ఎంతో మన్నన పొందిన శ్రీ అవంతి సిల్క్స్ ఇప్పుడు ఎనిమిదో వసంతంలోకి అడుగు పెట్టిందన్నారు. తమ దగ్గర కోసా సిల్క్, షెల్ సిల్క్స్, చందేరీ చీర, కలంకారి, బాటిక్ ప్రింట్, పైథాని, ఇక్కత్ చీరలు, మహేశ్వరి చీరలు, బాటిక్, మరిన్ని సారీస్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీష్గఢ్తోపాటు మరిన్ని రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలి పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిసెస్ ఇండియా తెలంగాణ మోడల్స్ క్యాట్ వాక్‌తో వావ్ అనిపించారు.