Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఏవీబీ పురం కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిధులలు దాదా పుగా రూ.17 లక్షలతో నిర్మించనున్న నాలా రిటర్నింగ్ వాల్ పనులను, రూ.25 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంఆ కార్పొరేటర్ మాట్లాడుతూ గతేడాది వర్షాలకు ఏవీబీ పురం కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడటంతో ఆ విషయం దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారనీ, దాన్ని త్వరతిగతిన పూర్తి చేసి రాబోయే వర్షాకా లంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయా లని అధికారులను కోరారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సూర్యం, కాలనీవాసులు దరగింఫ్ు, పల్గున్న, నారాయణ, చందర్రావు, వాసు, ఆనంద్, వేణు, పాల్గొన్నారు.