Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకులు జగన్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకులు జగన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ సీ బ్లాక్‌లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బస్తీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, భూగర్భ డ్రయినేజీ, నాలా పూడికతీత, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను స్థానికులు ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా పనులకు వ్యయ ప్రణాళికలు తయారు చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ శ్రీనివాస రావు, ఏఈ సతీశ్, వాటర్ వర్క్స్ మేనేజర్ అంకిత్, సీఓ కిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, నాయకులు, బాబుగౌడ్, హనుమంతు, కుర్మా రెడ్డి, రాజశేఖర్‌చారి, గణేష్, పాపిరెడ్డి, అంజయ్య నగర్ సీ బ్లాక్ అధ్యక్షులు కర్నాటి బాబురావు, రాము, అశోక్, వెంకటయ్య, రాజ్ కుమార్‌గౌడ్, నాగరాజు, ప్రశాంత్, విఘ్నేష్, కిరణ్, గోపాల్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.