Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి పదోన్నతి పొందటం హర్షణీయమని కార్పొరేటర్ సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి అన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారిలో కొందరికి పదోన్నతి లభించటం,అందులో జీహెచ్ఎంసీ, పోలీస్, విద్య, వైద్యం, తదితర విభాగాల్లో పదోన్నతి పొందిన ఉద్యోగుల ఆత్మీయ వేడుకలు ఆదివారం రాత్రి కాలనీలో నిర్వహించారు. 4వ డివిజన్ కార్పొరేటర్ సంరెడ్డి స్వప్నవెంకట్ రెడ్డి హాజరై పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉద్యోగులను పూల మాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ఒకే కాలనీలో ఉండి పదోన్నతి పొందడం సంతోషదాయకమన్నారు. కాలనీ అభివద్ధికి రాష్ట్ర అభివద్ధికి సహకరించాలని కోరారు. కాలనీ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. పదోన్నతి పొందిన వారిలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, హైమావతి, విజరు కుమార్, మధు, జనార్దన్, రమేష్ ఓబులేసు, వాణి ఉన్నారు. అదేవిధంగా మరో ప్రభుత్వ ఉద్యోగి, కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హనుమంతరావును, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకట్ రెడ్డిని సన్మానించారు. వ్యాఖ్యాతగా వినోబాచారి వ్యవహరించారు. కార్యక్రమంలో కి ఎమ్.రాజు, శ్రావణ్, సాయి కష్ణ, రషీద్ పాల్గొన్నారు.