Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ముషీరాబాద్ డివిజన్లోని పలు బస్తీల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం విస్తతంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అధికారులతో కలిసి మోహన్ నగర్, జాంభవినగర్ , గంగపుత్ర కాలనీ, బాపూజీ నగర్, ఆదర్శకాలనీ తదితర బస్తీల్లో పర్యటించి ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న అధికారులతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ బస్తీల్లో ప్రధానంగా డ్రయినేజీ మ్యాన్హోళ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. సాధ్యమైనంత మేరకు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఆదర్శనగర్ కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులతో స్థానిక కాలనీ నాయకులు సాంబశివరావు, ఇతరులు కలిసి వాగ్వాదానికి దిగారు. ఆదర్శనగర్ కాలనీ అనేక సార్లు పర్యటించినా, సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా స్థానికంగా ఇండ్లు అసలు అమ్ముడు పోవడం లేదని వాపోయారు. అంతే కాకుండా ా్థనికులు చాలా వరకూ ఇండ్లకు తాళాలు వేసి మిగతా ప్రాంతాల్లో నివసించేందుకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా ఆదర్శనగర్ కాలనీలో డ్రయినేజీ సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకులు ముఠా జైసింహ, టీఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ ప్రసాద్, ఆకుల అరుణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకుల సోమసుందరం, ముచ్చకుర్తి ప్రభాకర్, గోవింద్, భిక్షపతి యాదవ్, బల్ల ప్రశాంత్, లక్ష్మణ్ గౌడ్, ఎయిర్టెల్ రాజు, ఉమారాణి, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, డీజీఎం వాహబ్ తదితరులు పాల్గొన్నారు.