Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
చెత్త ఆటోలపై దౌర్జన్యమెందుకు అని సీపీఐ(ఎం) నాయకులు మహేందర్ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఇంటింటికి చెత్త సేకరించే ఆటో కార్మికులు చెత్తను సేకరించిన తర్వాత వారి ఆటోలని బతుకమ్మ కుంటలోని వాళ్ల ఇంటి దగ్గర రోడ్డు పై పార్కు చేస్తారు. ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేయడంతో నేడు ట్రాఫిక్ పోలీస్ వారు వారి ఆటోలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న బతుకమ్మ కుంట ఖాళీ స్థలంలో పార్కు చేస్తుండగా భూ కబ్జాదారులు ఎడ్ల సుధాకర్ రెడ్డి అక్కడకి వచ్చి ఆటో కార్మికులను కులంతో పేరుతో దూషించడంతో పాటు ఈ ప్రాంతం భూమి నాది అని చెప్పి ఆడవాళ్లని చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఎడ్ల సుధాకర్ రెడ్డిపై అంబర్ పేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని సీఐ సుధాకర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆటో కార్మికుల సమస్యలపై ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. చెత్త రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తా చెదారాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తూ వారి ఆటోలను రోడ్డుపై పార్కు చేస్తున్నందుకు చుట్టుపక్కల వాళ్లు అభ్యంతరంగా ఉందని తీవ్ర అంతరాయం జరుగుతుందన్నారు. ఖాళీగా స్థలం ఉందని, తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ చేయడం లేదని ప్రభుత్వ సూచనల మేరకే చెత్త సేకరించి పనులు చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వమే ఆటోలు కేటాయించిందన్నారు. దీనికి గాను చెత్త ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని చెత్త ఆటోవాల్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కష్ణ, వెంకయ్య, బాలకష్ణ, నాగులు, కురుమయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.