Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి నిరంతరం ప్రక్రియ
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివద్ధి నిరంతరం సాగుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్1వ, 29వ డివిజన్లలో రూ.2.31 కోట్లతో వరదనీటి కాల్వలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ప్రహారీ గోడలు తదితర అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎన్నో అభివద్ధి, సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం అమలు అవుతున్నాయన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయటం కోసం మనఊరు-మనబడి కార్యక్రమంలో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అభివద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు తమ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్థితిగతులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహా రెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, వై.రాం రెడ్డి, కోఆప్షన్ సభ్యులు, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, రాళ్లగుడం కష్ణా రెడ్డి, లిక్కి కష్ణా రెడ్డి, కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పి.సంతోష్ కుమార్, అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లో రూ.3.10 కోట్లతో పహాడి షరీఫ్ నుంచి మామిడిపల్లి వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక చైర్మెన్ అబ్దులా సాది, కమిషనర్ డా.జీ. ప్రవీణ్ కుమార్, రీప్రజెంట్ వైఎస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖైసర్ బాం, కౌన్సిలర్లు పుష్పమ్మ కొండల్ యాదవ్, లక్మీనారాయణ, పి.శంకర్,షేక్ పమీద అఫ్జల్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.జనార్దన్, మీడియా ఇన్చార్జి మాజీ ఆర్మీమెన్ వాసుబాబు, నాయకులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.