Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఒక వైపు ఈనెల 21 నుంచి ఓయూ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక పలు ప్రయివేట్ డిగ్రీ కళాశాలాలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి తమకు పరీక్ష ఫీజు చెల్లింపు అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారులు పరిపాలన భవన్ లోపలకు అనుమతించకపోవడంతో పోలీసులు వీరికి నచ్చజెప్పి వెనక్కి పంపించారు. కళాశాల యాజమాన్యం తమకు ఫీజులు విషయం సకాలంలో తెలియజేయలేదన్నారు. విద్యార్థులు, పలువురు కళాశాలల యాజమాన్యం సాయంత్రం ఓయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ రాజేంద్ర నాయక్తో కలిసి ఫీజు డేట్స్ పొడిగించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు.