Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అధునాతనమైన వైద్య విధానాలను అందించడంలో ఎల్లప్పుడూ ముందుడే యశోద హాస్పిటల్స్, క్యాన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించే అత్యాధునిక 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఇంటిగ్రేటెడ్ 'పెట్-సిటి' ''న్యూ అవుట్ - పేషెంట్ బ్లాక్, యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్''ను హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోకి వచ్చే మలక్‌పేట యశోద హాస్పిటల్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా ప్రారంభించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో ఒకటైన యశోద ఆస్పత్రులు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, అనుభవజ్ఞలైన వైద్య సిబ్బందితో ఇక్కడి రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పెట్ -సిటితో , క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడంతోపాటు, పాత తరాల పెట్ సిటికంటే ఇప్పుడు నాలుగు రెట్లు వేగంగా, తక్కువ స్కానింగ్ వ్యవధితో, తక్కువ రేడియేషన్ మోతాదుతో అత్యత్తమ నాణ్యమైన చిత్రాలను అందిస్తుందని, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఈ సందర్భంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. రావు, మాట్లాడుతూ.. ఇప్పుడు యశోద హాస్పిటల్స్‌లో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స కోసం సమగ్ర న్యూక్లియర్ మెడిసిన్ అందుబాటులో ఉందన్నారు. పెట్-సిటి, గామా కెమెరా ఇమేజింగ్, రేడియో న్యూక్లైడ్ థెరపీవంటి సేవలను ఇప్పుడు ఒకే తాటిపైకి తెచ్చి అందిస్తున్నామని తెలిపారు. ఎఫ్డిజి పెట్ సిటి ూజుు-జు) కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఇమేజింగ్, ఎముక స్కాన్ వంటి సాధారణ గామా ఇమేజింగ్, గా -68 డోటా, గా -68 పిఎస్ఎంఎ, 18 ఎఫ్ డోపా పెట్సిటి, డాట్ ఇమేజింగ్ అండ్ డబ్ల్యుబిసి స్కాన్ల వంటి అధునాతన, అరుదైన క్యాన్సర్ స్క్రీనింగ్ ఇమేజింగ్‌ను ఈ విభాగం అందిస్తుందని, మూత్రపిండాల పనితీరు, శరీర నిర్మాణన్ని అంచనా వేసే రేడియోఫార్మాస్యూటికల్స్ (సింటిగ్రాఫి), థైరాయిడ్ క్యాన్సర్, న్యూరోఎండోక్రిన్ కణతులు, ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం రేడియోన్యూక్లైడ్ వంటి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశం నలుమూలల నుండి రోగులు ఇక్కడికి వస్తున్నారని'' యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. రావు తెలిపారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి, మాట్లాడుతూ, క్యాన్సర్ కణాలు పెరగడానికి తగినంత శక్తిని కలిగి ఉండటానికి చక్కెర లేదా గ్లూకోజ్ అవసరం అన్నారు. పెట్సిటి స్కానింగ్ గ్లూకోజ్ మాదిరిగానే ఉండే రేడియోధార్మిక అణువును ఫ్లోరోడియోక్సిగ్లూకోజ్ (ఎఫ్డిజి), గ్లూకోజ్ జీవక్రియ, అధిక రేటు కారణంగా ప్రాణాంతక కణాలలో ఎఫ్‌డీజీ (ఖీణ+) పేరుకుపోతుంది. ఈ ఇంజెక్ట్ చేసిన తర్వాత, రోగి మొత్తం శరీర పెట్సిటి స్కానర్‌పై క్యాన్సర్ పెరుగుదలను బహిర్గతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు.ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పెట్సిటి స్కానర్, ఆర్ట్ ఇమేజింగ్ పద్ధతుల, రెండు స్థితులను మిళితం చేస్తుందని చెప్పారు. గ్లూకోజ్ జీవక్రియను పర్యవేక్షించడం ద్వారా, శరీరంలో క్యాన్సర్ పెరుగుదలను గుర్తించడంతో పాటు, చాలా సున్నితమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. సిటి అదే సమయంలో వివిధ గాయాలకు చెందిన స్థానం, పరిమాణం, ఆకారం గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. సంయుక్త పెట్ సిటి స్కానర్ పెట్ అండ్ సిటి చిత్రాలను విలీనం చేస్తుందన్నారు. వివిధ గాయాల పరిమాణం, ఆకారం గురించి సవివరమైన సమాచారాన్ని సాధారణ నిర్మాణాల నుండి క్యాన్సర్ గాయాలను కచ్చితత్వంతో వేరు చేసి చెపుతుందని డాక్టర్. పవన్ గోరుకంటి, తెలియజేశారు.