Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. తయారీదారుల నుంచి మధ్యవర్తిత్వం, దళారీలు ఎవరు లేకుండా నేరుగా చేనేత మేళాల ద్వారా ప్రజలు కొనుగోలుదారులు చేస్తే నాణ్యతతో పాటు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. సోమవారం హైదరాబాద్ హబ్సిగూడలోని ఐఐసీటీ క్లబ్లో జాతీయ చేనేత సిల్క్ ఫ్యాబ్రిక్ మేళాను కో ఆర్డినేటర్ కోట. దేవిక దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మేళా 20 రోజుల పాటు కొనసాగుతుందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీనిలో అన్ని రకాల చేనేత దుస్తులు, బెడ్ షీట్స్, టవల్స్ ఉన్నాయని, వీటిని నేరుగా తయారీదారుల నుంచి తీసుకువచ్చి అతి తక్కువ ధరలతో ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ దుస్తులు ధరిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాల కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానికులు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్వర్, పద్మజ, హేమ, రాజేశ్వరీ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.