Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ ప్రసిద్ధి చెందిన హనెన్ సెంటర్, కెనడా, నగరానికి చెందిన హియర్ 'ఎన్' సే క్లినిక్, క్లినికల్ డైరెక్టర్, స్పీచ్-లాంగ్వేజ్ పాథా లజీ, ప్రముఖ ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ గరిమా వేగివాడకు సర్టిఫికెట్ అందిం చింది. హనెన్ సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హనెన్ మోర్ దెన్ వర్డ్స్-ఫర్ పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ అటిజం అనే ఈ ప్రోగ్రామ్‌లో ఆటిజంతో బాధపడుతున్న తల్లిదండ్రులు, పిల్లల కు సహాయం చేయడానికి శిక్షణ పొందిన భారతదే శంలోని అతి కొద్దిమందిలో డాక్టర్ గరిమా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హియర్ 'ఎన్' సే క్లినిక్‌లో ఆడియాలజీ, స్పీచ్ థెరపీతో పాటు హనెన్ మోర్ దెన్ వర్డ్స్ ప్రోగ్రామ్ లో శిక్షణ, పిల్లలోని లోపాలను మెరుగ్గా అంచనా వేయడంలో, తల్లిదండ్రులకు అనుగుణంగా ప్రోగ్రామ్‌ను రూపొం దించడంలో తమ వద్ద ఉన్న నిపుణులు సహాయపడతారని తెలిపారు. ఆటి జంతో బాధపడుతున్న కొంతమంది పిల్లలు వినికిడి లోపంను కలిగి ఉంటారనీ, ఆటిజం థెరపిస్ట్లలో చాలా మంది ఈ సున్నితమైన సమస్యను పరిగణనలోకి తీసుకోరనీ, ఫలితంగా అలాంటి పిల్లల కు తక్కువ ప్రభావవంతమైన చికిత్స అందుతుందని తెలిపారు. ఆడియాలజీ నేపథ్యంతో మనం వారిలో వినికిడి లోపాన్ని గుర్తించి, లోపాలకు అవకాశం ఇవ్వకుండా నమ్మదగిన పునరావాసాన్ని అందించగలగాలనీ, వినికిడి మూల్యాం కనంను ఆటిజం నిర్ధారణ ప్రోటోకాల్‌లో భాగంగా చేయాలని కోరారు.