Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రముఖ సోలార్ తయారీ సంస్థ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్, దేశంలోని ప్రముఖ సస్టయినబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సరఫరాదారు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తిదారు అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్‌తో పరస్పర ప్రయోజనకర మైన వ్యూహాత్మక ఒప్పందంలోకి ప్రవేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మెగా ప్రాజెక్ట్స్ కింద ఈ విస్తరణ ప్రణాళిక కోసం ఇ-సిటీలో అదనంగా మరో 20 ఎకరాల భూమిని కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కొత్త మైలురాయి సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లా డుతూ ''ప్రీమియర్ ఎనర్జీస్, అజూర్ పవర్ల పునరావత పెట్టుబడిని రాష్ట్రం ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. తెలంగా ణలోని ఇ-సిటీలో వారి ప్రస్తుత అత్యాధునిక కేంద్రానికి ఆతిథ్యం ఇస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. కొత్త పెట్టుబ డులతో వారు ఇంకా పెద్దగా ఎదుగుతారని మేం విశ్వసి స్తున్నాం. మరికొన్ని గొప్ప ఎత్తులను చేరుకోవడానికి మా వ్యవస్థాపకులందరికీ మా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మేం హామీ ఇస్తున్నాం'' అని తెలిపారు.