Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో భారీగా పెంచిన బస్ పాస్ చార్జీలకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట సోమవారం సాయంత్రం వివిధ విద్యార్థి సంఘాలు, కళాశాలల విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ అంతటా యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో చదివే విద్యార్థులు బస్‌లో వెళ్లి చదువుకుంటున్న తరుణంలో ఒకే సారి బస్‌పాస్ చార్జీలు ఆకాశానికి అంటేలా పెంచడంతో తీవ్రమైన ఇబ్బందులను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు చదువుకోవాలి అని చెప్తూనే చదువుకు వెళ్లే బస్ చార్జీల గుదిబండను మోపడంపై విద్యార్థులు తీవ్రమైన అసంతప్తిని తెలియజేశారు. ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాల్సిన క్రమంలో పాస్ ధర మూడింతలు పెంచడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. పెరిగిన బస్ చార్జీలు పెంచని యెడల రాష్ట్రమంతటా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాయి భగత్, ఉప్పాల ఉదరు కుమార్, దివాకర్, సాయిరామ్, కార్తీక్, గోపి, రాజు, గ్రాపూర్, నేరు, అశోక్, కవులు, రచయితలు దొంతం చరణ్, పేర్ల రాము, మహేష్ వేల్పుల, షేక్ సలీమ్ పాల్గొన్నారు.