Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సోమవారం నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో పికెట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు, ఉపాధ్యాయులు పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వ హించారు. ప్రయివేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠ శాలలో ముద్దు అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేసు కుంటూ ర్యాలీగా వెళ్లారు. పాఠశాలల ప్రారంభం రోజు కావడంతో అతి స్వల్ప సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు హాజరు కాగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు పరిసరాల శుభ్రత కూడా అధికారులు నెలకొల్పలేకపోవడం గమనార్హం. తిరుమలగిరి, బొల్లారం, బోయిన్పల్లి, మడ్డి ఫోర్ట్ ప్రాంతాల్లో పాఠశాలల్లో విద్యార్థులు స్వల్పంగా హాజరయ్యారు.