Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఆటిస్టిక్ ప్రైడ్ డేను పురస్కరించుకుని సికింద్రాబా ద్‌లోని హియర్ ఎన్ సే క్లినిక్ వారు శనివారం టిస్టిక్ పిల్లల తల్లిదండ్రుల కోసం 'లెట్స్ టాక్ వర్క్‌షాప్' నిర్వ హించింది. నగరానికి చెందిన ప్రముఖ ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ ఆఫ్ హియర్ 'ఎన్' సే క్లినిక్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ గరిమా వేగివాడ ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. మెదడులో వ్యత్యాసాల కారణంగా ఏర్పడే అభివృద్ధి వైకల్యమైన ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్‌డి)తో బాధపడుతున్న పిల్లలను సమర్దవంతంగా ఎలా అర్దం చేసుకోవాలి, వారిని ఎలా పర్యవేక్షించాలి వంటి పలు విలువైన మార్గనిర్దేశాలతో తల్లిదండ్రులకు ఈ వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు ఈ వర్క్‌షాప్ ద్వారా అటిజం పిల్లల ప్రవర్తనాపరమైన సవాళ్లు, స్పీచ్, ఇంద్రియ పరిజ్ఞానంకు సంబంధించిన సమస్యలు, ఎఎస్డీ పిల్లలతో సన్నిహితంగా ఉండటంలో, వారు భిన్న విషయాలను అర్థం చేసుకునే నైపుణ్యం గల వ్యక్తులుగా ఎదగడానికి, కొన్ని ఆచరణాత్మక మార్గాలను అనుసరించడానికి శిక్షణ ఇచ్చినట్టు డాక్టర్ సాయి కృష్ణ వేగివాడ అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో స్క్రీన్, ఫోన్ సమయాన్ని తగ్గించే మార్గాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇది పిల్లల్లో బుద్ది ఎదుగుదల ను ప్రభావితం చేసే అతి పెద్ద చెడ్డ అంశాల్లో ఒకటి, బయట ఉన్నప్పుడు ఎఎస్డీ పిల్లలలో ఇది ప్రవర్తనా ప్రకోపానికి దారి తీస్తుంది. ఈ వర్క్‌షాప్‌లో తల్లి దండ్రులు తమ ఎఎస్డీ పిల్లలతో ఆడగల గేమ్‌లను పరిచయం చేసుకునేందుకు మాక్ గేమ్‌ల సెషన్ ఉం టుంది, వారి పరిపూర్ణ అభివృద్ధిలో పిల్లలకి అవి ఎలా ఉపయోగపడతాయనే దానిపై కూడా అవగాహన కల్పించినట్టు డాక్టర్ గరిమ వేగివాడ తెలిపారు. డెర్మటోగ్లిఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ (డిఎమ్ఐటి) నిపుణులు, బ్రెయిన్కోడ్ వ్యవస్థాపకులు, ప్రీతి ఉపాధ్యా య వర్క్‌షాప్‌లో భాగంగా పిల్లల వ్యక్తిత్వాలను బాగా అర్థం చేసుకోవడానికి వివిధ ప్రవర్తనా విధానాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.