Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, సీఐఐటీయూ నాయకులు
- ఏఎస్రావు నగర్, సరూర్‌నగర్‌లో నిరసన
- కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కాప్రా
అగ్నిపథ్‌ను రద్దు చేయాలనీ, నిర్ణయాన్ని వెనక్కి తీసుకో వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈసీఐఎల్ లోని సోనీ సెంటర్ సర్కిల్ రహదారి పై నిరసన చేపట్టారు. ఈ సందర్భగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల దేశ జాతీయ ప్రయో జనాలు దెబ్బతింటాయని పేర్కొంది. నాలుగేండ్ల కాలానికి కాంట్రా క్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తీసుకురావడ అంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమే అన్నారు. గడిచిన రెండేండ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదనీ, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవ డానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారనీ, దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారనీ, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందన్నారు. ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడా లంటూ యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అన్నా రు. ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశం లోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతున్నదన్నారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర మాజీ నాయకులు యాదగిరిరావు, ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులు శ్రీని వాస్, ఉన్ని కృష్ణ, శ్రీమన్నారాయణ, లక్ష్మణరావు, శోభ, గౌసియా బేగం పాల్గొన్నారు.
ఎల్బీనగర్ : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సరూర్‌నగర్ సర్కిల్ ప్రాంతంలో చైతన్యపురి డివిజన్లోని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ సరూర్ నగర్ సర్కిల్ కన్వీనర్ మల్లె పాక వీరయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సైన్యంలో రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే శరీర దారుఢ్య పరీక్షలు, రన్నింగ్ నిర్వహించారనీ, చివరగా నిర్వహించే రాతపరీక్షను నిర్వహించకుండా వాటికి తిలోదకాలిచ్చి సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన నిరుద్యోగ యువతీ యువకులను తీసుకోవడం దారుణమ న్నారు. అగ్నిపథ్ వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయ న్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సరూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శి వెంకన్న, రంగారెడ్డి జిల్లా ఆటో ట్రాన్స్పోర్ట్ సహాయ కార్యదర్శి రాములు, ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు రాములు, కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా సహ కార్యదర్శి మనోహర్, రాష్ట్ర వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్ పాల్గొన్నారు.