Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వినికిడి తగ్గిందనే సమస్యతో హాస్పిటల్కు తీసుకొచ్చిన హైదరాబాద్కు చెందిన 23 ఏండ్ల యువతికి ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్స్ సర్జన్లు సంక్లిష్టమైన, అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స చేశారు. యువతి 15 ఏండ్లుగా ఈ వ్యాధితో బాధపడుతోంది. చెవిలో విపరీతమైన నొప్పితో బాధపడిన మహిళకు క్లినికల్ పరీక్షల తర్వాత, 'కంజెనిటల్ కొలెస్టిటోమా'లి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు సర్జన్లు నిర్ధారణకు వచ్చారు. కామినేని హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఎన్.అపూర్వ రెడ్డి వైద్య పరిస్థితిపై మాట్లాడుతూ ''కంజెనిటల్ కొలెస్టీటోమా అనేది మధ్య చెవిలో ఏర్పడే అసాధారణ చర్మం పెరుగుదల. ఇది సాధారణంగా పుట్టినప్పుడు లేదా పిల్లల ప్రారంభ వయస్సులో (5-10 ఏండ్లు) సంభవిస్తుంది. కొలెస్టేటోమాతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 2శాతం మంది వారి ప్రారంభ వయస్సులోనే దీని బారిన పాడుతారు. సరైన చికిత్స చేయకుంటే, కొలెస్టీటోమా పెద్దదిగా పెరిగి అనేక రకాల సమస్య లను కలిగిస్తుంది. కాలక్రమేణా, కొలెస్టియాటోమా పెరుగుతూ ఉంటే, అది మధ్య చెవి, లోపలి చెవి, మెదడుకు సమీపంలో ఉన్న ఎముకలు, లోపలి చెవి, ముఖానికి సమీపంలో ఉన్న నరాల లోపల ఉన్న ఎముకలను క్షీణింపజేస్తుంది. దాంతో వినికిడి లోపం, ప్రమాదకరమైన మెదడు సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. చికిత్స చేయని కొలెస్టీటోమా దీర్ఘకాలంలో ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది'' అని తెలిపారు. ''బాలిక పరిస్థితిని పూర్తిగా పరీక్షించిన తర్వాత, రోగి చెవికి ఒక వైపు విస్త్రతమైన ఇన్ఫెక్షన్తో కూడిన మాస్ ఉందనీ, అది మెదడుకు ఆనుకుని ఉన్న ఎముకలు, ముఖ్యమైన రక్త నాళాలు వ్యాధి ద్వారా దెబ్బతిన్నాయని మేం నిర్ధారణకు వచ్చాం. ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని, మేం వెంటనే ఆమెకు 'మాడిఫైడ్ రాడికల్ మాస్టోయిడెక్టమీ' సర్జరీని చేసాం. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఐదు రోజుల పరిశీలన తర్వాత రోగిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసాం'' అని డాక్టర్ అపూర్వ రెడ్డి తెలిపారు.