Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బద్లావ్ మిషన్‌కు కట్టుబడి, క్రెడిట్ కార్డ్ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే వినూత్న క్రెడిట్ కార్డ్ ప్రొడక్ట్‌ను ప్రారంభించింది. ఇది ఎల్ఐటీ (లైవ్-ఇట్-టుడే) క్రెడిట్ కార్డు. ఈ కార్డుతో ఫీచర్లను ఎంచుకునే అధికారాన్ని బ్యాంక్ కస్టమర్ల చేతుల్లో పెట్టింది, అన్ని కేటగిరీలు ఒకే కార్డులో అందుబాటులో ఉన్నాయి. ఇంకా, వారి మారుతున్న జీవనశైలి అవసరాలకు అనుగుణంగా ఈ ఫీచర్లను ఆన్ లేదా ఆఫ్ చేసే స్వేచ్ఛ కూడా వారికి లభిస్తుంది. ''ఏయూ బ్యాంక్‌లో, బ్యాంకింగ్ పరిశ్రమకు అవసరమైన మార్పును తీసుకురావడానికి సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా యథాతథ స్థితిని సవాలు చేయాలని మేం ఎల్లప్పుడూ విశ్వసిస్తున్నాం. గతేడాది మేం మా కస్టమర్లను శక్తివంతం చేయడానికి క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియోను ప్రారంభించిన మొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయ్యాం. త్వరలో, డిజిటల్‌గా అవగాహన ఉన్న, జెన్ వినియోగదారులకు వారు ఉపయోగించే ప్రొడక్టులపై మరింత నియంత్రణ అవసరమని మేం గమనించాం. ఇది అనుకూలీకరించదగిన ఎల్ఐటీ క్రెడిట్ కార్డ్ పరిణామానికి దారితీసింది. ఇది అనేక క్రెడిట్ కార్డుల లక్షణాలను ఒకే కార్డులోకి తీసుకొస్తుంది. మేం ఇలాంటి అనేక వినూత్న ఉత్పత్తులను ప్రారంభించడం కొనసాగిస్తాం'' అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సంజరు అగర్వాల్ తెలిపారు.