Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్‌సీల్లో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వైద్యశాఖలో 317 జీఓతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావును కలిసి ములుగు నియోజవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. 317 జీఓ వల్ల వైద్య ఉద్యోగులు భర్త, భార్య వేర్వేరు చోట్ల ఉంటూ అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీహెచ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు, వైద్య సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల ఉండటంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో మెడిసిన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.