Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రయినేజీలు, పార్కుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం తన క్యాంప్ ఆఫీసులో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు వివిధ పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అవసరమైన పనులకు సంబంధించిన ప్లాన్రెడీచేస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. అలాగే ఫతే నగర్ డివిజన్లో పార్కులు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జులైలో కేపీహెచ్బీలో రూపుదిద్దుకుంటున్న ఇండోర్ స్టేడియంలను, బాలానగర్ రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న నూతన పాఠశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కూకట్పల్లి నియోజకవర్గం అభివద్ధికి మారుపేరుగా నిలిచిందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబియా బేగం, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, పగుడాల శిరీష బాబురావు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.