Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. డివిజన్ పరిధిలోని జగద్గిరి నగర్లో డ్రయినేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కార్పొరేటర్ బస్తీలో పర్యటించి పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి శానిటేషన్ సిబ్బందితో కలిసి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇంద్రగౌడ్, మహమూద్, ఆజం, ఆంజనేయులు, మల్లారెడ్డి, సురేందర్, రాజు, నారాయణ మేస్త్రి, శంకర్,జీహెచ్ఎంసి జవాన్ జిలాని పాషా, తదితరులు పాల్గొన్నారు.