Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాధికా థియేటర్ వద్ద ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్లో యూనిఫామ్స్, బుక్స్ దందా ఆపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు విద్యాధికారి ఆఫీస్ నుంచి సీఆర్పీ వేణు వచ్చి రాధిక దగ్గర ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్లో యూనిఫామ్స్, బుక్స్ రూమ్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ గౌతమ్ మోడల్ స్కూల్లో యూనిఫామ్స్, పుస్తకాల పేరుతో రూ.5-20 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా ఫీజు వసూలు చేసుకోమని ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా గౌతమ్ మోడల్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 91లో సెక్షన్ 1 ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్ఛిత మైన నిబంధనలేమీ లేదన్నారు. వీటి అమ్మకాలకు పాఠశ ాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదని తెలిపారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చు అనీ, ఈ విధంగా విద్యా హక్కు చట్టాలు చెబుతుంటే ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థలు మాత్రం ఏకంగా పాఠశాలల్లోనే పుస్తకాలు యూనిఫాం అమ్మకాలు చేపట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా విద్యాధి కారులు స్పందించండి అధిక ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై వెంట నే చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో డీఈఓ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉప్పల్ అధ్యక్షుడు ఖాషిం జాలం, ఎస్ఎఫ్ఐ కాప్రా ఇన్చార్జి సాయి ఉత్తేజ్, ఎస్ఎఫ్ఐ కాప్రా నాయకులు వెంకటసాయి, సాయికిరణ్, భాస్కర్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.