Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టా లని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి కాంట్రాక్టర్లును ఆదే శించారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని మామిడి పల్లిలోని 11,12వ డివిజన్ల కార్పొరేటర్లు శివకుమార్, యాతం పవన్ కుమార్ యాదవ్‌తో కలసి మేయర్ పర్యటించారు. బాలాజీ నగర్ కాలనిలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ డివిజన్లలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 11వ డివిజన్లో గతంలో నిర్మించిన డ్రయినేజీని పరిశీలించి దాన్ని కొంత పొడిగించాలని కార్పొరేటర్, స్థానికులు కోరడంతో సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్మాణం చేపడుతామని హామీని చ్చారు. కార్పొరేషన్లో మరింత అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ జ్యోతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.