Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంచార్జ్ కమిషనర్ పద్మజారాణి
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇంచార్జ్ కమిషనర్ పద్మజారాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని బంగారు మైసమ్మ నుండి చెంగిచర్లకు వెళ్లే మార్గమధ్యలో రోడ్లపై పండ్లదుకాణంవారు ప్లాస్టిక్ కవర్లలో పండ్లు వేసీ అమ్ముతున్నారన్న సమాచారంతో మున్సిపల్ అధికారులు కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వెయ్యి రూపాయలు జరిమానా వేశారు. ఆర్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బోడుప్పల్ కార్పొరేషన్‌ను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఐ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జాన్‌పాల్, హెల్త్ అసిస్టెంట్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.