Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జలమండలి డైరెక్టర్ స్వామి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన తాగునీటి సరఫరాలో ఇబ్బం దులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జలమండలి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 35కు పైగా నీటి కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా పూర్తి స్థాయిలో సర్వే చేస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే బోడుప్పల్ ప్రజల అవసరాల కోసం 18 ఎంఎల్ నీటిని సరఫరా చేస్తున్నామని, ఈ ప్రాంతంలో ప్రాజెక్టు లేని కారణంగా కష్ణా నీటిని వెలుగు గుట్ట రిజర్వా యర్ నుండి సరఫరా చేస్తున్నామని తెలిపారు. బోడుప్ప ల్లో ఇప్పుడున్న వాటర్ ట్యాంక్‌లతో పాటు ఇంకా రెండు అవసరం ఉన్నాయన్నారు. త్వరలోనే ఓఅర్అర్ ఫేజ్ మూడులో భాగంగా రూ.56 కోట్లతో వాటర్ ట్యాం కుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇవన్నీ పూర్తయితే ప్రెషర్ పెరిగి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రోజు తప్పించి రోజు నీటి సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్మ్షీ గౌడ్, కార్పొరేటర్లు కొత్త దుర్గమ్మ, కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సుమన్ నాయక్, సీసా వెంకటేశ్‌గౌడ్, జలమండలి ఓఅర్అర్ సీజీఎం ఆమరేందర్ రెడ్డి, జీఎం శ్రీనివాస రెడ్డి, డీజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ మమత, టీఆర్ఎస్ నేతలు కొత్త రవిగౌడ్, జె.రాములు, కొత్త చక్రపాణి గౌడ్,గుర్రాల వెంకటేష్ గౌడ్, బందారపు శ్రీధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
డ్రయినేజీ తవ్వకాలతో వాటర్ పైప్లైన్లు పగులుతున్నాయా?
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నూతనంగా నిర్మించే డ్రయినేజీ పనుల కోసం తవ్వే గుంతల వల్లనే మంచి నీటి పైప్ లైన్లు దెబ్బతింటున్నాయని తెలుస్తోంది. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో అనేక ప్రాంతాలలో డ్రెయి నేజీ పనుల కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లోనే మంచి నీటి సరఫరా చేసే పైప్ లైన్లు పగిలిపోయాయి అంటే తప్పు ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారుల తీరులో మార్పు వస్తుందా అనేది ఆలోచించాలి.