Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ ప్రదీప్ చౌదరి
నవతెలంగాణ-బంజారాహిల్స్
జెమినీ ఎడిబల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా)కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశంలో అమ్మకాల పరిమాణం పరంగా నెంబర్ 1 బ్రాండ్‌గా గుర్తించారు. ఫ్రీడమ్ ఆయిల్ ఇప్పుడు రైస్ బ్రాన్, వేరుశెనగ ఆవనూనె కూడా అందిస్తుంది. నిల్సన్ ఐక్యు అధ్యయనం ఇప్పుడు కిరాణా, జనరల్ స్టోర్స్, కెమిస్ట్‌లు, కాస్మోటిక్ స్టోర్లు, పాన్ ప్లస్ స్టోర్లు, మోడ్రన్ ట్రేడ్ స్టోర్లును కూడా కవర్ చేస్తుంది. దీనితో పాటుగా జీఈఎఫ్ ఇండియా ప్లాటినమ్ అవార్డును 'హయ్యస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇన్ ఇండియా'గా గ్లోబాయిల్ అవార్డు 2021 గెలుచుకుంది. ఇండియా టు డే 'ఇప్సోస్ అర్బన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే 2020' ప్రకారం భారతదేశంలో అగ్రశ్రేణి 5 కుకింగ్ ఆయిల్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఫ్రీడమ్ బ్రాండ్ నిలిచింది. ఈ సందర్భంగా జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో విలువ పరంగా భారతదేశంలో నెంబర్ 1 బ్రాండ్‌గా ఫ్రీడమ్ నిలువడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. రాబోయే ఐదేండ్లలో తమిళనాడు, కేరళలలో కూడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామన్నారు. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ పీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వినియోగదారులు తమపై చూపుతున్న విశ్వాసం, అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు చెప్పారు. భారతీయ వంటకాలకు అత్యంత అనువైన నూనెగా సన్‌ఫ్లవర్ నూనెను భావిస్తు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దీనిలోని పోషక విలువలు నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఏ,డీ లను సైతం కలుపుతున్నరాని దీనిలో సహజసిద్ధంగా ఉండేటటువంటి విటమిన్ ఈ కూడా ఉందని తెలిపారు. ఆరోగ్యం పట్ల పూర్తి స్పహ కలిగిన వినియోగదారుల రోజువారీ వినియోగానికి ప్రాధాన్యతా ఎంపికగా ఫ్రీడమ్ ఆయిల్ నిలుస్తుందని వివరించారు.