Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కళాశాలల సాంకేతిక తప్పిదం కారణంగా హాల్ టికెట్లు రాని 3000 మందికి వెంటనే ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ పరిపాలన కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. 'ఓయూ పరిధిలో దాదాపుగా 2 లక్షల 50 వేల మంది డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. వివిధ సాంకేతిక కారణాల రీత్యా దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రాలేదు. దీని కారణంగా ఫైనలియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈసమస్యను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలి' అని ఏఐఎస్ఎఫ్ కోరారు.
స్పందించిన రిజిస్ట్రార్
విద్యార్థుల సమస్యలు విన్న రిజిస్ట్రార్ వెంటనే స్పందించి వీసీ విదేశీ పర్యటన ముగించుకొని ఓయూ రాగానే, అన్ని కళాశాల ప్రిన్సిపాల్ పిలిపించి మీటింగ్ పెట్టి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ ఎన్. శంకర్,ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివ కుమార్, అందొజు అఖిల్ జిల్లా ఉపాధ్యక్షుడు, సామిడి వంశివర్థన్ రెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, అరుణ్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, కళాశాల విద్యార్థులు అభిషేక్ , మునిస్వామి, శివ ప్రకాష్, బాలు, రాజేష్, ప్రశాంత్ నాగరాజు, మణికంఠ, పాల్గొన్నారు.