Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాల వద్ద వసూల్ రాజా..!
- బేగంపేట డివిజన్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
- పట్టింపులేని టౌన్ ప్లానింగ్ అధికారులు
నవతెలంగాణ-బేగంపేట
బేగంపేట్ సర్కిల్లో షాడో హల్చన్ చేస్తున్నాడు. డివిజన్ పరిధిలో అక్రమ కట్టడాల వద్ద వసూళ్లకు పాల్పడుతూ దందాకు తెర లేపాడు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న భవనాలపై కన్నేసి మరీ వసూళ్లకు దిగుతున్నాడు. ముఖ్యంగా బేగంపేట డివిజన్ పరిధిలో మున్సిపల్ అనుమతి లేకుండా భారీ అక్రమ భవంతుల నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగు తున్నాయి. బేగంపేట డివిజన్ పరిధిలోని ప్రకేశ్ నగర్ వాటర్ ట్యాంక్ వెనక వీధిలో మున్సిపల్ అనుమతికి మించి నిర్మాణం చేపడుతుండడంతో నిర్మాణాదారుడి వద్ద నుంచి ఆ షాడో కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు చర్చ జరుగుతోంది. ఎస్డ్ రోడ్ మినార్వా కాంప్లెక్స్ ఎదురుగా పాత భవనం పై మూడు అంతస్తులు మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతుండటంతో భవనం వద్ద కూడా అన్ని తానే చూసుకుంటా నగదు వసూలు చేసిన ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాసిగూడలో అనుమ తికి మించి నిర్మాణం చేపట్టడంతో అక్కడా ఈ షాడో కార్పొ రేటర్ నిర్మాణదారున్ని వదల్లేదని ఓ గుత్తేదారు తెలిపారు. ప్రకాష్ నగర్ పాత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడా షాడో కార్పొరేటర్ తన కాలు మోపాడు. నిర్మాణా వద్ద కార్పొరేటర్ గానీ, వాళ్ల అనుచరులు కానీ వసూళ్ళు చేయవద్దని స్థానిక మంత్రి తలసాని గతంలో చెప్పినా వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరో వైపు ఆధికారులు తమకు వచ్చే మామూళ్లకు అలవాటు పడి అటువైపే చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లు కనీసం నోటీసు కూడా ఇవ్వడం లేదు. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తు న్నారనే ఆరోపణలు వనిపిస్తున్నాయి. అక్రమ నిర్మా ణాలపై ప్రభుత్వం ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీరుతో ఆచరణలో అమలును నోచు కోవడం లేదు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కండ్ల ముందు పేకమేడల్లా అనుమతుల్లేని బహుళ అంతస్థులు వెలు స్తున్నా తమకేమీ పట్టనట్టుగా బేగంపేట టౌన్ ప్లానింగ్ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణం జరుగుతు న్న ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేస్తే ముందుగానే ఆయా భవన నిర్మాణ యజ మానులతో కుమ్ముక్కయిన సిబ్బంది ఏవిధంగా నిబంధ నలు అతిక్రమించాలో భవన యజమానులకు నేర్పుతు న్నారు. ఈ విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ (బల్దియా) ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు ప్రభుత్వ అధికారులకు తెలియకపోవడం ఒక కారణమైతే కింది స్థాయి సిబ్బంది స్థానిక నాయకులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే మరో కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా బేగంపేట సర్కిల్ ఉన్నతాధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని, మునుముందు మరిన్ని జరగకుండా అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.