Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అందరూ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోయినపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మండలం మూడుచింతలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తోకల సదా శివ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, వారి అనుచరులు దాదాపు 40మందితో కలిసి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా వేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, వనందాస్ మురళి గౌడ్, సర్పంచులు జాం రవి, కపాకర్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.