Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
నివాసాల మధ్య ఉన్న వ్యర్థాల గుట్టలను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్ నగర్ బస్తీలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకందనగర్, బసవతారకనగర్ మధ్యలో ఉన్న డంప్ యార్డ్ బస్తీ వాసులకు తీవ్ర సమస్యగా మారుతోందన్నారు. ప్రజల నివాసాల మధ్య ఇటువంటి డంపింగ్ యార్డ్ కార్యకలాపాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక మహిళలు తమ బాధలను పట్టించుకునే వారు లేరని, చిన్న పిల్లలు స్కూల్కు వెళ్లడానికి దారి సరిగాలేక కిందపడి గాయాలపాలౌతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే బస్తీవాసులతో కలిసి మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్, శ్యామ్ నాయుడు, రాజు, శ్రీనివాస్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.